Sunday, May 4, 2025

తెరపై చూడని కాన్సెప్ట్‌తో పర్పెక్ట్ డార్క్ కామెడీ మూవీ

- Advertisement -
- Advertisement -

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా గుర్రం పాపిరెడ్డి. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వెను సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ‘గుర్రం పాపిరెడ్డి‘ సినిమా మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ పూర్తిగా కొత్తగా ఉండి ఆకట్టుకుంటోంది. పర్పెక్ట్ డార్క్ కామెడీ మూవీ ఎలా ఉండబోతుందో ఈ మోషన్ పోస్టర్ చూపిస్తోంది. డిఫరెంట్‌గా డిజైన్ చేసిన క్యారెక్టర్స్‌ను హైదరాబాద్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో స్టైలిష్‌గా చూపించారు దర్శకుడు మురళీ మనోహర్. మోషన్ పోస్టర్‌లోని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్, కామెడీ హైలైట్‌గా నిలుస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News