Tuesday, July 22, 2025

నేడు దాశరథి శతజయంతి

- Advertisement -
- Advertisement -

నిజాం నిరంకుశత్వంపై ధిక్కార
స్వరం అక్షర శరాలు
సంధించి తెలంగాణ ప్రజల్లో
ఉద్యమస్ఫూర్తిని రగిల్చిన
కృష్ణమాచార్య ప్రభుత్వం
ఆధ్వర్యంలో నేడు
రవీంద్రభారతిలో ఉత్సవాలు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ మహాకవి దాశరథి కృష్ణమాచార్య. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి.. నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి. నిజాం పాలకుల చేతిలో స్వేఛ్చా స్వాతంత్య్రా లు కోల్పోయి జీవచ్చవాల్లా బ్రతుకుతున్న తెలంగా ప్రజ ల్లో ఉద్యమ స్పూర్తిని రగిల్చి నిజాం పాలనపై అక్షర శరా లు సందించి ధిక్కార స్వరం వినిపించిన ఉద్యమ దాశరథి చిన్న వయసులోనే మహాకవిగా దాశరథి కీర్తి గడించారు. 1925 జులై 22న వరంగల్ జిల్లా చిన్న గూడూరులో వెంకటమ్మ, వేంకటాచార్యులకు దాశరథి జన్మించారు. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూ మీడియంలో చదివి మెట్రిక్యులేషన్ చేశారు. భోపాల్ యూనివర్సిటీలో ఇంటర్మీడియెట్ పూర్తి చేశారు. ఓయూలో ఇంగ్లీ షు లిటరేచర్‌లో బిఎ చదివారు. ఇంగ్లీష్‌తో పాటు సంస్కృ తం, ఉర్దూ భాషల్లో మంచి పాండిత్యం సంపాదించారు. హైదరాబాదు సంస్థానంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొన్నారు. 1987 నవంబర్ 5న దాశరథి కన్నుమూశారు. బతికింది 62 ఏళ్లే అయినా.. తెలంగాణ ప్రజల గుండెల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించాడు.

ప్రతి రచనలోనూ వై విధ్యం ఉంటుంది. పలు సి నిమాలకు గేయ రచయిత గా, ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్‌స్పెక్టర్‌గా, ఆ కాశవాణి ప్రయోక్తగా పని చేశారు. సాహిత్య రంగంలో చేసిన కృషి మరువలేనిది. కథలు, నాటికలు, సినిమా పా టలు, కవితలు రాశారు. నిజాం పాలనలో పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు. ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వ హయాంలో జైలు శిక్ష అనుభవించారు. నిజామాబాద్‌లోని ఇందూరు కోటలో ఆయనతోపాటు మరో 150 మంది ఖైదీలుగా జైలులో ఉన్నారు. పళ్లు తోముకోవాల్సిన బొగ్గుతో జైలు గోడలపై పద్యాలు రాసి దెబ్బలు తిన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత భావ ప్రేరిత ప్రసంగాలతో ఊరురా సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించారు.
అన్నవరం దేవేందర్‌కు

దాశరథి కృష్ణమాచార్య అవార్డు
దాశరథి కృష్ణమాచార్య శత జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, కాలమిస్ట్ అన్నవరం దేవేందర్‌కు దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ పురస్కారాన్ని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దాశరథి కృష్ణమాచార్య జయంతి (జులై 22) సందర్భంగా సాహిత్య రంగంలో విశిష్ట కృషి చేసిన వారికి అందజేస్తుంది. అన్నవరం దేవేందర్ తెలంగాణ సంస్కృతి, సమాజం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే సాహిత్య రచనలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. మంగళవారం రవీంద్రభారతిలో జరిగే దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలలో ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డుతో పాటు రూ.1,01,116 నగదు, జ్ఞాపికను అందజేస్తారు. అన్నవరం దేవేందర్ తొవ్వ (2001), మరోకోణం (సామాజిక వ్యాసాలు 2002), నడక (2003), మంకమ్మ తోట లేబర్ అడ్డా (2005), బుడ్డపర్కలు (నానీలు, 2006), బొడ్డు మల్లె చెట్టు (2008-), పొద్దు పొడుపు (2011), ఫార్మాల్యాండ్ ఫ్రాగ్రెన్స్ (2011) రచనలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

ఉద్యమ వైతాళికుడు దాశరథి: సిఎం
తెలంగాణ రైతాంగ సాయధ పోరాటంలో అక్షరాన్ని ఆ యుధంగా మలిచి.. నిజాం నిరంకుశ పాలనపై ధిక్కార స్వరం వినిపించిన మహానీయుడు ఉద్యమ వైతాళికుడు, మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. దాశరథి శత జయంతి సందర్భంగా తెలంగాణకు, సాహిత్య రంగానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News