మన తెలంగాణ/నాంపల్లి: నగరంలో టాంక్‌బండ్‌పై దాశరథి విగ్రహాన్ని త్వరలో ప్రతిష్టించనున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఈ మేరకు కార్యచరణనగరంలో టాంక్‌బండ్‌పై దాశరథి విగ్రహాన్ని త్వరలో ప్రతిష్టించనున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఈ మేరకు కార్యచరణ రూపకల్పనను ప్రారంభించి, మహా సాహితీవేత్త ప్రతిమను నెలకొల్పేందుకు హెచ్‌ఎండీకి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి రవీంద్రభారతి కళావేదికపై ప్రభుత్వ పక్షాన మహాకవి కృష్ణమాచార్య దాశరథి శత జయంత్యుత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. దాశరథి రచనలు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు ఈ దిశగా రాష్ట్రంలో 12 వేల గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ గ్రంథాలయాల్లో కూడా ఆయన పుస్తకాలు ప్రజలు చదివే అవకాశం కల్పిస్తామని, ఆయన సాహిత్యం ప్రతి పల్లెకు పంపించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. దాశరథి వ్యక్తి కాదు.. శక్తి అని పేర్కొన్నారు.
అప్పట్లో ప్రబలిన సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా తన రచనలు చేసి, సమాజంలో ప్రజల మద్య ఐక్యత, చైతన్యాన్ని తీసుకొచ్చిన దిగ్గజ సాహితీ మూర్తి దాశరథి అని ఘనంగా శ్లాఘించారు. అన్యాయాలపై తన కలాన్ని ఉపయోగించి రచనలు చేశారు. తొలి దశ తెలంగాణ ప్రజా ఉద్యమంలో దాశరథి కీలక పాత్ర పోషించారు. తన రచనల ద్వారా ప్రజల్లో జాగృతుల్ని తీసుకొచ్చారని ప్రస్తుతించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దాశరథి తెలంగాణ మలి దశ ఉద్యమానికి ప్రేరణ ఇచ్చారన్నారు. ఆయన ప్రభావంతో ఎందరో కవులు, సామాజిక స్పృహాతో రచనలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, గణేశ్, రచయిత అందెశ్రీ, యాకుబ్,జయ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాహితీవేత్త అన్నవరం దేవేందర్ దాశరథి సాహితీ అవార్డును స్వీకరించారు.