మూడు వన్డేలు, మూడు టి-20ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే ఆతిథ్య జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌ని సఫారీ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాళ్టి (సెప్టెంబర్ 10) నుంచి ఇరు జట్ల మధ్య టి-20 సిరీస్ ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు సౌతాఫ్రికా జట్టకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా కీలక ఆటగాడు డేవిడ్ మిల్లర్ (David Miller) ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇటీవల జరిగిన హండ్రెడ్ లీగ్‌లో నార్తెన్ సూపర్‌ఛార్జర్స్ జట్టు తరఫున ఆడుతున్న సమయంలో మిల్లర్ హ్యామ్‌స్ట్రింగ్‌కి గాయమైంది.
ఆ గాయం నుంచి ఇంకా అతడు కోలుకోకపోవడంతో అతను ఈ టి-20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా అధికారికంగా ప్రకటించింది. అయితే మిల్లర్ (David Miller) బదులు ఆడే ప్లేయర్‌ని మాత్రం ప్రకటించలేదు. 14 మంది సభ్యులతోనే ఈ సిరీస్‌లో కొనసాగనుంది. మిల్లర్ తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా పాల్గొనలేదు. కొంతకాలంగా అతడు టి-20లకు మాత్రమే పరిమితమవుతున్నాడు. వన్డేలపై మిల్లర్ ఆసక్తి చూపించకపోయానా.. 2027 ప్రపంచకప్‌లో ప్లాన్స్‌లో ఉంటాడని వన్డే కెప్టెన్ బవుమా వెల్లడించాడు.
Also Read : హాంకాంగ్ పై ఆఫ్ఘాన్ భారీ విజయం