Friday, May 2, 2025

ఐదేళ్ల తర్వాత ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు

- Advertisement -
- Advertisement -

 

నల్గొండ: కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందని మారుతీరావు ఆమె భర్త ప్రణయ్‌ని ఐదేళ్ల క్రితం హత్య చేయించిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సుమారు ఐదు సంవత్సరాల తర్వాత నల్గొండ ఎస్సి, ఎస్టి కోర్టు సంచలన తీర్పు వెలువరిచింది. ఈ కేసులో ఎ-2గా ఉన్న సుభాష్‌కుమార్ శర్మకు కోర్టు ఉరి శిక్ష, మిగితా వారికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.

2018 సెప్టెంబర్ 14వ తేదీన మారుతీరావు తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ అనే వ్యక్తిని సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించాడు. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ.. 2019లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఎ1గా మారుతీరావు, ఎ2గా సుభాష్‌కుమార్ శర్మ, ఎ3గా అస్గర్ అలీ, ఎ4గా బారీ, ఎ5గా కరీం, ఎ6 శ్రవణ్ కుమార్, ఎ7గా శివ, ఎ8గా నిజాంల పేర్లను నమోదు చేశారు. అయితే 2020లో ఎ1 మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్నారు. సుమారు ఐదేళ్ల పైగా కోర్టులో ఈ కేసుపై విచారణ సాగగా.. ఇటీవలే వాదనలు ముగిశాయి. తాజాగా నల్గొండ కోర్టు తుది తీర్పు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News