Friday, May 2, 2025

మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటారని సిఎం తెలిపారు. ఆయన సిఎల్పీ సమావేశంలో మాట్లాడుతూ..పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువని తెలియజేశారు. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం అని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు అని సూచించారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News