Friday, September 5, 2025

ఆ సత్తా కోహ్లి, రోహిత్‌కు ఉంది.. విమర్శలపై దీప్‌దాస్ గుప్తా..

- Advertisement -
- Advertisement -

టీమిండియా సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలపై కొంత మంది సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విమర్శలపై బిసిసిఐ మాజీ సెలెక్టర్ దీప్‌దాస్ గుప్తా స్పందించాడు. ప్రపంచ క్రికెట్‌లోనే కోహ్లి, రోహిత్‌లను మించిన బ్యాటర్లు లేరన్నాడు. మరికొంత కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగే సత్తా వారికుందన్నాడు. అయితే కొందరు పనిగట్టుకుని వీరు క్రికెట్ వీడ్కోలు పలకాలను సలహాలు ఇవ్వడాన్ని దీప్‌దాస్ తప్పుపట్టాడు. వారిని క్రికెట్ నుంచి తప్పుకోవాలని కోరే హక్కు ఎవరికీ లేదన్నాడు. వన్డేల్లో రోహిత్ పలు సార్లు డబుల్ సెంచరీలు సాధించాడని, ఇక కోహ్లి ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడని గుప్తా పేర్కొన్నాడు. వన్డేల్లో అసాధారణ రీతిలో రాణించిన వీరిపై కొంత మంది అర్థం పర్థంలేని విమర్శలకు దిగడం సరికాదన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News