Wednesday, June 11, 2025

బ్యాడ్మింటన్‌ స్కూల్ ను ప్రారంభించిన దీపికా పడుకొనె

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ హాట్ ట్యూటీ దీపికా పడుకునె తన తండ్రి, దిగ్గజ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొనేకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. మంగళవారం ఆయన 70వ పుట్టినరోజు సందర్భంగా ‘పడుకోన్ స్కూల్ ఆఫ్ బాడ్మినాన్ (PBS)’ను ప్రారంభిస్తున్నట్లు దీపికా ప్రకటించింది. తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని పంచుకుంది.

“బ్యాడ్మింటన్ ఆడుతూ పెరిగిన వ్యక్తిగా, ఈ క్రీడ ఒకరి జీవితాన్ని శారీరకంగా, మానసికంగా. భావోద్వేగపరంగా ఎంతగా రూపొందిస్తుందో నేను ప్రత్యక్షంగా అనుభవించాను. పడుకోన్ స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్ (PSB) ద్వారా మేము అన్ని వర్గాల వారికి బ్యాడ్మింటన్ ఆనందాన్ని, క్రమశిక్షణను అందించాలనుకుంటున్నాం. ముఖ్యంగా బ్యాడ్మింటన్‌తో ఆరోగ్యం, దృష్టిని పెంచడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభిస్తున్నాం” అని పేర్కొంది. తన తండ్రి ఈ పిఎస్‌బికి గురువు, సలహాదారుడుగా ఉంటాడని దీపికా వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News