కార్తీక్‌రాజు, నోయల్, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎం.పూర్ణానంద్ దర్శకత్వంలో త్రిపుర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించిన ‘దీర్ఘాయుష్మాన్ భవ’ (Deerghayushman bhava) చిత్రం విడుదలకు సిద్ధమైంది. కాగా ఈ చిత్రం ట్రైలర్, ప్రోమోస్ , పాటలను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పలువురు అతిథులు ఆవిష్కరించారు. ట్రైలర్‌ను తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ కె.ఎల్.దామోదర్ ప్రసాద్, ప్రోమోస్‌ను నటుడు ఓ.కల్యాణ్, పాటలను జబర్దస్త్ ఆర్.పి. ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ “మంచి అభిరుచితో, మంచి కాంబినేషన్ ఆర్టిస్టులతో ఈ సినిమా తీసినట్లు అనిపిస్తోంది.
తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని (entertain audience) ఆశిస్తున్నాను”అని అన్నారు. చిత్ర నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ మాట్లాడుతూ అన్ని భావోద్వేగాలు ఉన్న చక్కటి చిత్రమిదని పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు ఎం.పూర్ణానంద్ మాట్లాడుతూ “ఫ్యామిలీ ప్యాక్ చిత్రమిది. అందరినీ ఆహ్లదపరిచే కామెడీ, ఉంది. సోసియో ఫాంటసీగా దీనిని మలిచాం”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నట్టి కుమార్, జెమినీ సురేష్, రాంబాబు గోషాల తదితరులు పాల్గొన్నారు.