Thursday, May 8, 2025

మా లక్ష్యం ఉగ్రవాదులే.. పాకిస్తాన్ కాదు

- Advertisement -
- Advertisement -

 లంకా దహనం చేశాం..
సైనికులకు రక్షణ మంత్రి
రాజ్‌నాథ్ సింగ్ సెల్యూట్

న్యూఢిల్లీ: భారత్ మాతా కీ జై అంటూ ఆ పరేషన్ సిందూర్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. బుధవారం తెల్లవారు జామున భారతీయ సేనలు, పాకిస్థాన్ భూ భాగంలోని ఉగ్రవాదుల శిబిరాలను దెబ్బ తీసిన ఘటన తరువాత రాజ్‌నాథ్ మీడియా తో మాట్లాడారు. దాడి ఎందుకు ? ఏ విధం గా జరిగిందనేది అందరికీ తెలిసిందే. పహ ల్గాం ఉగ్రదాడికి నిరసనగా మన సేనలు కేవ లం ఉగ్రవాదుల స్థావరాలనే ఎంచుకుని నిర్ణీ త దాడులకు దిగాయని రాజ్‌నాథ్ వివరించా రు. ఇది కేవలం ఉగ్రవాదులను ఎంచుకుని సాగించిన విలువైన దాడి అని, మరణించింది ఉగ్రవాదులు అయినందున ఈ ఆపరేషన్ పూర్తిగా విజయవంతం అయిందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌ది ఉద్రిక్తతలను పెంచే దాడి కాదన్నారు. సరైన విధంగా ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించి తరువాత వాటిని లక్షంగా చేసుకుని తమ సేనలు దాడికి దిగాయని వివరించారు. ఇది సరైన సమయంలో, సరైన రీతిలో , ఎంచుకున్న లక్షాలను దెబ్బతీసే చర్య అని స్పష్టం చేశారు. సైనికులు లంకా దహనం చేసి విజయఢంకా మోగించారని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News