Tuesday, May 6, 2025

ఢిల్లీకి కమ్మిన్స్ షాక్ మీద షాక్.. నలుగురు ఔట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ షాక్ మీద షాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ జట్టు మ్యాచ్‌ని అద్భుతంగా ఆరంభించింది. కమ్మిన్స్ వేసిన మొదటి ఓవర్ తొలి బంతికే కరుణ్ నయర్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మూడో ఓవర్‌లో తొలి బంతికి డుప్లెసిస్(3) పెవిలియన్ చేరాడు. అనంతరం కమ్మిన్స్ వేసిన ఐదో ఓవర్ మొదటి బంతికి అభిషేక్ పొరెల్(8) ఔట్ అయ్యాడు. ఇక హర్షల్ పటేల్ వేసిన 6వ ఓవర్‌లో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్(6) కమ్మిన్స్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 4 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజ్‌లో కెఎల్ రాహుల్(8), స్టబ్స్(0) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News