Friday, May 30, 2025

‘పెద్ది’ స్టైల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. వైరల్ అవుతున్న వీడియో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా.. బిచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌షాట్‌ని విడుదల చేశారు. పూర్తి మాస్ లుక్‌లో రామ్ చరణ్ ఈ ఫస్ట్‌షాట్‌లో కనిపించారు. విడుదలైన కొద్ది సమయంలోనే ఇది ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. చాలామంది సోషల్‌మీడియాలో ఈ వీడియోపై స్పూఫ్‌లు కూడా చేశారు.

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పెద్ది స్టైల్‌లో ఓ వీడియోను విడుదల చేసింది. టీజర్‌లో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్స్ బ్యాక్‌గ్రౌండ్ వస్తుండగా.. ఢిల్లీ ఆటగాళ్ల ప్రాక్టీస్ దృశ్యాలను ఇందులో చూపించారు. చివర్లో పెద్ద స్టైల్‌లో ఓ షాట్ కూడా ఆడారు. దీనిపై రామ్‌చరణ్ షేర్ చేశారు. తమ వీడియోను ఇంత అద్భుతంగా రీక్రియేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ‘ఈరోజు మ్యాచ్‌కి ఆల్‌ ది బెస్ట్. కానీ, సిద్ధంగా ఉండండి సన్‌రైజర్స్ కమ్‌బ్యాక్ ఇవ్వొచ్చు’ అని రామ్‌ చరణ్ పేర్కొన్నారు. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌‌లో గెలిస్తేనే సన్‌రైజర్స్‌కి ప్లేఆఫ్స్‌కి వెళ్లే ఆశలు సజీవంగా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News