హమ్ దార్ద్ అఫ్జా పానీయంపై వివాదాస్పద వ్యాఖ్యలను చేస్తూ కొత్త వీడియో విడుదల చేసినందుకు యోగా గురువు బాబా రామ్ దేవ్ ను ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా మందలించింది. గతంలో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, అలాంటి ప్రకటనలను చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక దశలో కోర్టు ధిక్కారణకు పాల్పడినట్లు ప్రకటించేందుకు కోర్టు సిద్ధమైంది. కోర్టు ఆదేశాలకు తలవొగ్గిన బాబా రామ్ దేవ్ 24 గంటల్లో సోషల్ మీడియాతో సహా అన్ని వేదికల్లోనూ, వివాదాస్పద ప్రకటనను తొలగించేందుకు అంగీకరించాడు.వెంటనే తొలగించే పని చేపట్టారని ఆయన తరుపు న్యాయవాది కోర్టుకు విన్నవించాడు.భవిష్యత్ లోనూ
ఇలాంటి ప్రకటనలు చేయబోరని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ కేసు విచారణ సందర్భంగా రామ్ దేవ్ బాబా ఎవరి నియంత్రణలోనూ లేడని, త
న సొంత ప్రపంచంలో విహరిస్తున్నాడని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. హమ్ దార్ద్ రూహ్ అఫ్జా పై షర్బత్ జిహాద్ అంటూ బాబా రామ్ దేవ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూపతంజలి గులాబ్ షర్పత్ ను ప్రచారం కోసం చేసిన ఈ అభ్యంతర ప్రకటనలపై రామ్ దేవ్, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ పై హమ్ దార్ద్ నేషనల్ పౌండేషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఏప్రిల్ 22న ఢిల్లీ హైకోర్టు రామ్ దేవ్ వ్యాఖ్యలను ఖండిస్తూ, ఇలాంటి ప్రకటనలు సమర్థించలేనివని పేర్కొన్నది. దీని తర్వాత సంబంధిత వీడియోలు, ప్రకటనలను తొలగిస్తానని రామ్ దేవ్ కోర్టుకు హామీ ఇచ్చారు. భవిష్యత్ లోనూ అలాంటి ప్రకటనలను చేయబోరని నిర్ధారిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.