Monday, May 12, 2025

ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు.. బాలీవుడ్ మోడల్ కు జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

తన ప్రియుడు మంజీత్ భార్య సునీతా సెహ్రావత్ హత్య కేసులో బాలీవుడ్ మోడల్ ఏంజెల్ గుప్తా అలియాస్ శశి ప్రభకు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. ఆమె ప్రియుడికి కూడా ఈ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ నేరపూరిత కుట్ర చేసినట్లు కోర్టు పేర్కొంది. దీంతో మోడల్ గుప్తా, ఆమె ప్రియుడు జీవితాంతం తీహార్ జైలులో గడుపనున్నారు.

హర్యానాలోని సోనిపట్‌లో మంజీత్ సెహ్రావత్ భార్య, 38 ఏళ్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు అయిన సునీతా సెహ్రావత్‌ను అక్టోబర్ 29, 2018న పాఠశాలకు వెళుతుండగా కాల్చి చంపారు. ఆమె విద్యాపరంగా చేసిన కృషికి సత్కారం పొందేందుకు వెళ్తుండగా.. ఢిల్లీలోని బవానా ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఆమెపై ఇద్దరు దుండగులకు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మోడల్ ఏంజెల్ గుప్తా తన ప్రియుడు మంజీత్ తో కలిసి సునీతాను చంపేందుకు సుఫారీ ఇచ్చినట్లు తెలిసింది.

మొదట ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులను మంజీత్ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ, సునీత వ్యక్తిగత డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. అందులో ఆమె తన భర్త వివాహేతర సంబంధం గురించి, అతను తనకు హాని కలిగించవచ్చనే విషయాన్ని పేర్కొంది. దీంతో హత్యకు ముందు, తరువాత మంజీత్-ఏంజెల్ మధ్య ఫోక్ కాల్స్ ను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. సునీతను చంపడానికి.. మంజీత్, ఏంజెల్ కలిసి రాజీవ్ అలియాస్ విశాల్ అలియాస్ జానీ అనే కాంట్రాక్ట్ కిల్లర్‌ను రూ. 10 లక్షలు ఇచ్చి ఆమెను హత్య చేయించినట్లు తేలడంతో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో వీరిద్దరికీ జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News