Wednesday, September 3, 2025

రీల్స్ చేస్తుందని భార్యను చంపేసి.. భర్త పాయిజన్ తాగి ఉరేసుకొని

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: యూట్యూబ్‌లో రీల్స్ చేస్తుదని భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన ఢిల్లీలోని నజఫ్‌గఢ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓల్డ్ రోషన్‌పూర్ ప్రాంతంలో అమన్(35) అనే వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. అమన్ భార్య యూట్యూబ్‌లో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంది. ఆమెకు ఇన్ స్టాగ్రామ్‌లో ఆరు వేల ఫాలోవర్స్ ఉన్నారు. పలుమార్లు భర్త రీల్స్ చేయవద్దని భార్యను హెచ్చరించాడు. భర్త మాటలను పట్టించుకోకుండా రీల్స్ చేస్తుండడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కోపంలో ఆమెను చంపేసి అనంతరం అమన్ పాయిజన్ తాగాడు. అనంతరం ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే అతడిని ఆర్‌టిఆర్‌ఎం ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఉత్తర ప్రదేశ్‌లోని పిలిభిత్‌కు చెందిన ఈ దంపతులు నాలుగు నెలల క్రితం నజఫ్‌గఢ్‌కు మారారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News