Wednesday, August 20, 2025

ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు..

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో మరసారి స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఉదయం ఢిల్లీలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మాలవీయ నగర్‌లోని SKV పాఠశాల,కరోల్ బాగ్‌లోని ఆంధ్రా పాఠశాలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఢిల్లీ పోలీసు స్నిఫర్, బాంబు నిర్వీర్య బృందం ఘటనాస్థలానికి చేరుకుని విస్తృతంగా సోదాలు చేశారు. ఇప్పటివరకు రెండు స్కూల్స్, వాటి ఆవరణలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని పోలీసులు తెలిపారు. కాగా, ఢిల్లీలో పాఠశాలలకు వరుస బెదిరింపులు వస్తుండటం కలవరపెడుతోంది. బెదిరింపు మెయిల్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News