మన తెలంగాణ/పాలకుర్తి: ఢిల్లీ యూనివర్సిటీలో సీటు సాధించిన తన కొడుకు ఫీజు కట్టలేక ఓ తల్లి బాధపడుతుంది. ఫీజు కట్టే చివరి తేదీ దగ్గర పడుతుండటంతో ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతోంది. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపురం పెద్దతండాకు చెందిన భూక్య మాజీకి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. 20 ఏళ్ల నుంచి భర్తకు మతిస్థిమితం బాగా లేకపోవడంతో ఇళ్లలో, హోటళ్లలో పనిచేస్తూ మాజీ తన కూతుళ్లను డిగ్రీ వరకు చదివించి పెళ్లి చేసింది.
కాగా చిన్నవాడైన కుమారుడు వంశీని ఇంటర్ వరకు చదివించింది. ఇటీవల వంశీ ఆలిండియా ప్రవేశ పరీక్ష రాసి ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ కోర్సులో సీటు సాధించాడు. అడ్మీషన్, హాస్టల్ ఫీజు రూ.లక్షకు పైగా ఉండటంతో అంత డబ్బు కట్టలేక వంశీ ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో తన కొడుకు చదువుకు సహకరించాలని తల్లి మాజీ దాతలను వేడుకుంటుంది. భూక్య కల్యాణి 7674852691 ఫోన్ పే నంబరుకు దాతలు సాయం అందించి తన కుమారుడిపై చదువులకు సాయం చేయాలని తల్లి కోరింది.