Friday, July 11, 2025

లంచావతారులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ని మ్జ్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ మెదక్ రిజియన్ డిఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం… సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరదిలోని న్యాల్‌కల్ మండలం హుస్సేల్ల్లి గ్రామానికి చెందిన భూనిర్వాసితునికి 52.87 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చేందుకు రూ. 65 వేలు నిమ్జ్ (నేషనల్ ఇన్‌న్వెస్టిమెంట్ మ్యానుఫాక్చరింగ్ జోన్) అధికారులు డిమాండ్ చేశారు. బాధితుడు అధికారులతో విసుగు చెంది ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో నిమ్జ్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాజు రూ.50 వేలు, డిప్యూటీ తహశీల్దార్ సతీష్ రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

హుస్సేల్లికి చెందిన సదరు బాధిత రైతు కుటుంబ సభ్యులకు కూడా రావాల్సిన నష్టపరిహారం కోసం జహీరాబాద్ ఆర్డీవో డ్రైవర్ దుర్గయ్య మధ్యవర్తిత్వం వహించి నష్టపరిహారం ఇప్పించేందుకు లక్ష డిమాండ్ చేశారు. అందులో డిప్యూటీ కలెక్టర్‌కు రూ.75 వేలు, కార్యాలయ సిబ్బందికి రూ.25 వేలు ఇవ్వాల్సి ఉంటుందని రైతుకు చెప్పారు. దీనికి సంబంధించి కాల్ రికార్డ్ కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహశీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్యలను అరెస్టు చేసినట్లు డిఎస్పీ సుదర్శన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News