శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు , శిరీష్ తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఎస్‌విసి60’ను ఇటీవల ప్రకటించారు. రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో అలరించిన యంగ్ స్టార్ ఆశిష్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో నూతన దర్శకుడైన ఆదిత్య రావు గంగసాని తన క్రియేటివ్ విజన్‌ను తెరపైకి తీసుకురానున్నారు. ఈ చిత్రం హైదరాబాద్ వీధుల్లో చోటుచేసుకునే కల్చర్‌తో నిండిన, భావోద్వేగంతో కూడిన అనుభూతిని ప్రేక్షకులకు అందించనుంది. ఆశిష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేసింది. మాస్‌కు నచ్చే స్టైల్లో ‘దేత్తడి’ అనే టైటిల్ పెట్టారు. ఇది హై ఎనర్జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను సూచిస్తోంది.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆశిష్ హైదరాబాద్ వీధుల్లో కనిపించే డప్పు వాద్యకారుడి గెటప్‌లో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. భుజాలపై డప్పు తగిలించుకుని రెండు స్టిక్స్‌తో బలంగా మోగిస్తుండగా, మూడో స్టిక్‌ను పళ్ల మధ్యలో పట్టుకుని, అతని ముఖం మొత్తం జోష్‌తో నిండిపోయి ఉంది. అతని దుస్తులు కూడా అతని క్యారెక్టర్‌ను తెలియజేస్తూ మాస్ ఫీల్‌ను ఇస్తున్నాయి. బ్యాక్‌డ్రాప్‌లో డప్పులు మోగుతున్న గుంపు చుట్టూ జనం ఉత్సాహంగా డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇది సినిమా ఎంత ఎనర్జీగా ఉంటుందో సూచిస్తోంది. ఈ సినిమాలో మాస్ మేకోవర్‌లో కనిపించనున్న ఆశిష్, హైదరాబాదీ యాసలో డైలాగులు చెప్పడం సినిమాకు మరో హైలైట్ కానుంది. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది