Thursday, July 24, 2025

బెంగళూరు బస్టాండ్‌లో పేలుడు పదార్థాలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు లోని రద్దీగా ఉండే కలాసిపాళ్య బస్టాండ్ లో ప్లాస్టిక్ కవర్ లో దాచిన ఆరు జిలెటిన్ స్టిక్స్ ను బుధవారం నాటి ఉదయం స్థానిక పోలీసులు, యాంటీ – టెర్రరిస్ట్ స్క్వాడ్ స్వాధీనం చేసుకున్నాయి. ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉండే బస్టాండ్ సమీపంలో ప్లాస్టిక్ కవర్ లో దాచిన జిలెటిన్ స్టిక్స్ కనిపించడం తీవ్ర ఆందోళన కలిగించింది. కళాసి పాళ్య పోలీసు అధికారులు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కలిసి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కలాసిపాళ్య బిఎంటీసి బస్టాండ్ లో టాయిలెట్ పక్కన క్యారీబ్యాగ్ లో ఆరు జిలెటిన్ స్టిక్స్ కొన్ని డిటోనేటర్లు విడివిడిగా దొరికినట్లు పోలీసు డిప్యూటీ కమిషనర్ (వెస్ట్) ధ్రువీకరించారు. ప్రత్యక్షసాక్షి, పబ్లిక్ టాయిలెట్ వద్ద పనిచేసే మాట్లాడుతూ, ఎవరో టాయిలెట్ కు వెళ్లే ముందు తన బ్యాగ్ ను ఇక్కడ వదిలి వేశారని తెలిపాడు. వాళ్లు తిరిగి వచ్చి తీసుకుంటారని తాము

సాధారణంగా బ్యాగ్ ను తమవద్దే ఉంచుకుంటామని, ఎవరూ రాకపోవడంతో గార్డుకు ఆ విషయం తెలిపామని చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదన్నాడు.ప్రాథమిక అంచనాల ప్రకారం పేలుడు పదార్థాలు డెడ్ డ్రాప్ అయి ఉండవచ్చు.ఇలాంటి జిలెటిన్ స్టిక్స్ ను సాధారణంగా క్వారీ బ్లాస్టింగ్ కు ఉపయోగిస్తారు. సాధారణంగా ఆంధ్రా సరిహద్దుల్లోని అనంతపురం సమీప క్వారీలలో, కోలార్ లోనూ, తమిళనాడు లోనూ వినియోగిస్తారని పోలీసు వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో ఇద్దరు భద్రతా సిబ్బంది బస్టాండ్ టాయిలెట్ వద్ద ఎవరో వదిలివేసిన బ్యాగ్ ను ఏటీఎస్ అధికారికి అప్పగించారు. అక్కడే డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ అధికారి ఇతరులు ఉన్నారు. బ్యాగ్ ను తెరిచి చూసి అవి పేలుడు పదార్థాలు అయి ఉండవచ్చునని అనుమానించి పోలీసు కంట్రోల ్రూమ్ కు తెలిపారు. యాంటీ బాంబ్ స్క్వాడ్ ఆ జిలెటిన్ స్టిక్స్ ను స్వాధీనం చేసుకుంది. పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News