- Advertisement -
నల్లగొండ: స్కూల్ బస్సు కిందపడి ఎల్‌కెజి చదువుతున్న చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ ప్రైవేట్ స్కూల్‌లో జస్మిత అనే బాలిక(4) ఎల్‌కెజి చదువుతోంది. బస్సును డ్రైవర్ రివర్స్ చేస్తుండగా తీవ్రంగా గాయపడింది. వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి చనిపోయిందని వైద్యులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: ఆహార భద్రతా చట్టం పురోగతి ఎంత?
- Advertisement -