Sunday, May 4, 2025

రహదారుల అనుసంధానం అన్నింటికంటే ముఖ్యమైనది: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రహదారులు అభివృద్ధి చెందినప్పుడే పెట్టుబడులు వస్తాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పదేళ్లుగా జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రహదారుల అనుసంధానం అన్నింటికంటే ముఖ్యమైనదని చెప్పారు. వాజ్ పేయీ హయాంలో స్వర్ణ చతుర్భుజి పథకాన్ని తెచ్చారని, రోడ్ల నిర్మాణంపై లక్షల కోట్లు ఖర్చు ఎందుకని ఆనాడు కొందరు విమర్శించారని అన్నారు.

మోడీ ప్రభుత్వం వచ్చాక రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని, కనెక్టివిటీ కోసం మోడీ ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చుపెడుతోందని పేర్కొన్నారు. పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలకు రహదారులు నిర్మిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్- శ్రీశైలం మధ్య ప్రయాణ సమయం తగ్గించేలా రోడ్లు నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు. హైదరాబాద్- విజయవాడ మధ్య ఆరు లైన్ల రహదారికి యత్నిస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News