Wednesday, August 20, 2025

కోర్టులో అందరి ముందు ఏడ్చేశా.. చాహల్ తో విడాకులపై ధనశ్రీ..

- Advertisement -
- Advertisement -

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య, నటి-కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ ఎట్టకేలకు విడాకులపై స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన విడాకులు, కెరీర్ పై ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ధనశ్రీ మాట్లాడుతూ.. విడాకుల సమయంలో తాను ఎంతో బాధ అనుభవించానని చెప్పారు. విడాకులపై తీర్చు ఇవ్వబోతున్న సమయంలో తాను కోర్టులోనే బోరునా ఏడ్చానని తెలిపారు. “అది..నాకు, నా కుటుంబానికి అత్యంత భావోద్వేగ క్షణం. మానసికంగా సిద్ధంగా ఉన్నప్పటికీ నేను ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఆ సమయంలో నేను ఏమి అనుభూతి చెందుతున్నానో కూడా నేను మాటల్లో చెప్పలేకపోయాను. నేను అందరి ముందు ఏడ్చేశాను. విడాకులు సెలబ్రేట్ చేసుకునే విషయం కాదు. ఇది చాలా విచారకరం, భావోద్వేగకరమైనది. ఇందులో ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు, రెండు కుటుంబాలు కూడా ఉంటాయి. విడాకుల సమయంలో నాపై మీడియాలో వచ్చిన వార్తలు చూసి.. ఎంతో బాధపడ్డాను” అని ధనశ్రీ చెప్పుకొచ్చారు.

త్వరలో తాను టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ధనశ్రీ వెల్లడించారు. విడాకుల తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. తాను టాలీవుడ్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నానని తెలిపారు. ఓ తెలుగు సినిమాలో తొలిసారి నటిస్తున్నానని.. ఈ మూవీ డ్యాన్స్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు చెప్పారు. ఇందులో పాత్ర కోసం తాను తెలుగు భాష నేర్చుకోవాల్సి వచ్చిందని, ఇది సవాలుతో కూడుకున్నదని తెలిపారు. ఈ సినిమా 2025 అక్టోబర్‌లో విడుదల కానుందని వెల్లడించారు. కాగా, 2020లో పెళ్లి చేసుకున్న చాహల్, ధనశ్రీలు..2025 మార్చిలో విడాకులు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News