Wednesday, August 27, 2025

బుధవారం రాశిఫలాలు (27-08-2025)

- Advertisement -
- Advertisement -

మేషం: చేపట్టిన కార్యక్రమాలు అనుకున్నసమయానికి పూర్తి చేస్తారు. అనుకోని అవకాశం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.

వృషభం: బంధవులతో ఏర్పడిన విరోదాలు పరిష్కారమై ఊరటచెందుతారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. మిత్రుల నుండి సహాయం అందుకుంటారు.

మిథునం: శ్రమ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అకారణ విరోదాలు ఏర్పడవచ్చు. మాటల సందర్భంలో నిదానం అవసరం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభం సూచిస్తుంది.

కర్కాటకం: బాద్యతలు అధికమవుతాయి. మిత్రుల ద్వారా ధనలాభం పొందుతారు. అరుదైన ఆహ్వానాలు ఆనందం. కలిగిస్తాయి. ప్రముఖుల కలయిక విందు, వినోదాలు.

సింహం: వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు వుంటాయి. సంఘంలో గౌరవం పొందుతారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. అనుకోని ఆహ్వానాలు అందుతాయి.

కన్య: ఉద్యోగాలలో స్వల్ప మార్పులు వుంటాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా వుండటం మంచిది. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వస్తులాభం. సన్నిహితులతో సరదాగా గడుపుతారు.

తుల: భాగస్వామ్య వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుండి సాయం అందుతుంది. నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

వృశ్చికం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. నూతన మిత్రులు పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. సంతానమునకు నూతన ఉద్యోగావకాశాలు.

ధనుస్సు: క్రయవిక్రయాలలో తొందరపాటు వద్దు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సోదరులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు.

మకరం: కష్టానికి ఫలితం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది. స్వల్ప ధనలాభం. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త వహించండి.

కుంభం: ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. వివాదాలకు దూరంగా వుండండి.అరుదైన ఆహ్వానాలు.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

మీనం: బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి. సోదరుల నుండి ధనలాభం పొందుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త వహించండి.

Rasi phalalu cheppandi

Dhanasu rasi phalalu

Dhanasu rasi phalalu

Dhanasu rasi phalalu

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News