Thursday, August 14, 2025

సెప్టెంబర్ 1న సిపిఎస్ కు వ్యతిరేకంగా ఇందిరాపార్కు వద్ద ధర్నా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/కాసిపేటః కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్)కు వ్యతరేకంగా సెప్టెంబర్ 1న హైద్రాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద పిఆర్‌టియుటిఎస్ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుందని పిఆర్‌టియుటిఎస్ మండల అధ్యక్షులు గంప శ్రీనివాస్ తెలిపారు. గురువారం కాసిపేట మండలంలోని ధర్మరావుపేట ఉన్నత పాఠశాల ఆవరణలో ధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుచు ఉపాద్యాయ, ఉద్యోగ వర్గాల భద్రత, భరోసాకు ముంపుగా పరిణమించిన సి.పి.ఎస్ విధానాన్ని రద్దు చేసి కాంగ్రేస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెష్టోలో ప్రకటించిన విధంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని, ధీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేసారు.

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాద్యాయ వర్గాలలో వ్యక్తం అవుతున్న ఆందోళనను దృష్టిలో ఉంచుకొని యు.పి.ఎస్ విదానాన్ని ప్రవేశపెట్టవద్దని ఆయన కోరారు. 30 సంవత్సరాలు పని చేసిన ప్రభ్తు ఉద్యోగికి మలి వయస్సులో భద్రత కోసం పాత పెన్షన్ విధానమే సరి అయినదని ఆయన అన్నారు. సెప్టెంబర్ 1వ తేదిన ఇందిరాపార్క్ వద్ద నిర్వహించ తలపెట్టిన ధర్నా ఎం.ఎల్.సి పింగిళి శ్రీపాల్‌రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్ ప్రదాన కార్యదర్శి పులగం దామొదర్‌రెడ్డి ల ఆద్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, ధర్నాకు ఉద్యోగులు, ఉపాద్యాయులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాద్యాయులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News