బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టోర్నమెంట్ నుంచి బయటకు వచ్చేసింది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరివరకూ పోరాడినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. మ్యాచ్ పోయినప్పటికీ.. చెన్నై సారథి ఎంఎస్ ధోనీ.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక జట్టుపై 50 సిక్సులు కొట్టిన మూడో ఆటగాడిగా ధోనీ నిలిచాడు.
ఈ జాబితాలో ధోనీ కంటే ముందు క్రిస్ గేల్, రోహిత్ శర్మ ఉన్నారు. క్రిస్ గేల్ పంజాబ్‌పై 61. కెకెఆర్‌పై 54 సిక్సులు బాదాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 50 సిక్సులు కొట్టాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో సిక్సు కొట్టిన ధోనీ.. 50 సిక్సర్ల లిస్టులోకి ఎక్కాడు. ఇక ఐపిఎల్‌లో అత్యధిక సిక్సులు కొట్టి లిస్టులో 262 సిక్సులతో ధోనీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ధోనీ కంటే ముందు గేల్(357), రోహిత్ (297), కోహ్లీ(290) ఉన్నారు.