దులీప్ ట్రోఫీ 2025 తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి సెమీఫైనల్ మ్యాచులు జరుగనున్నాయి. ఇందులో ఒక సెమీఫైనల్‌లో సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు సెంట్రల్ జోన్ జట్టుకు షాక్ తగిలింది. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ధృవ్ జురెల్‌ను (Dhruv Jurel) సెలెక్టర్లు జట్టు నుంచి తప్పించారు. జురెల్‌కు ప్రత్యామ్నాయంగా విదర్భ రంజీ కెప్టెన్ అక్షయ్ వాద్కర్‌ని జట్టులోకి తీసుకున్నారు. వాస్తవానికి ఈ టోర్నీ ప్రారంభానికి ముందు జురెల్‌ని సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా ప్రకటించారు.
నార్త్ ఈస్ట్ జోన్‌తో మ్యాచ్ సమయానికి జురెల్‌కు (Dhruv Jurel) జ్వరం ప్రారంభమైంది. దీంతో ఆ మ్యాచ్ ఆడలేకపోయాడు. అతడి స్థానంలో రజత్ పాటిదార్ కెప్టెన్సీ చేశాడు. ఇప్పుడు జురెల్ మొత్తం టోర్నీ నుంచి వైదొలగడంతో పాటిదార్ పూర్తిస్థాయిలో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే జురెల్‌కు ప్రత్యామ్నాయంగా ప్రకటించిన అక్షయ్ వాద్కర్ వాస్తవానికి సెంట్రల్ జోన్ తొలుత ప్రకటించిన జట్టుకే ఎంపిక కావాల్సింది. అయితే టీం ఇండియాకు ఆడిన ఆటగాళ్లు ఎక్కువగా ఉండటంతో అప్పట్లో అతడిని పరిగణలోకి తీసుకోలేదు. దీంతో అప్పుడు సెలెక్టర్లపై విమర్శలు వచ్చాయి. కానీ, ఇప్పుడు జురెల్ స్థానంలో అతడిని జట్టులోకి తీసుకోవడం జట్టుకు ఏ మాత్రం కలిసొస్తుందో చూడాలి మరి..
Also Read : సంజూ శాంసన్‌ను టాప్ ఆర్డర్‌లో ఆడించాలి: ఆకాశ్ చోప్రా