Thursday, September 18, 2025

ప్రాజెక్టు పనులను సిఎం మూడుసార్లు పరిశీలించారు: నిమ్మల

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రాజెక్టు పనులు షెడ్యూల్ కు అనుగుణంగా జరుగుతున్నాయని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు (nimmla Ramanaidu)తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులను నిమ్మల పరిశీలించారు. ప్రాజెక్టు పనులను సిఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడుసార్లు పరిశీలించారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డయాఫ్రమ్ వాల్ (Diaphragm wall) పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. వర్షాకాలంలోనూ పనులు చేసేలా బట్రస్ డ్యామ్ పనులు పూర్తి కావొచ్చాయని, 2027 చివరి నాటికి పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా పనులు జరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే పోలవరం హెడ్ వర్క్స్ 80 శాతానికిపైగా పూర్తయ్యాయని తెలియజేశారు. పోలవరం పనులు వేగంగా జరుగుతుంటే ఓర్వలేక అసత్య కథనాలు జరుగుతున్నాయని, డి వాల్ నిర్మాణం 1.5 మీటర్ల మందంతో నిర్మిస్తుంటే తప్పుదోవ పట్టిస్తున్నారని వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించారు. జర్మనీకి చెందిన బావర్ కంపెనీతో మేఘా పనులు చేయిస్తుంటే దుష్ప్రచారమా? అని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News