Thursday, September 18, 2025

గుంటూరులో విజృంభించిన అతిసార… 30 మంది ఆస్పత్రిలో చేరిక

- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో అతిసార విజృంభించింది. వాంతులు, విరోచనాలతో 30 మందికి అస్వస్థత గురికావడంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుంటూరులోని ఆర్టీసీ కాలనీ రెడ్లబజార్, బుచ్చయ్య తోట నల్లచెరువు, రెడ్డిపాలెంలో అతిసార ప్రబలినట్టు సమాచారం. బాధితులను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
భారీ వర్షాలు కురవడంతో నీటి వనరులు కలుషితం కావడంతో దీనికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. తక్కెళ్లపాడులో రిజర్వాయర్ల వద్ద నీటిని శుద్ధి చేస్తున్నామని అధికారులు తెలుపుతున్నారు. ఇళ్లలోకి సరఫరా చేసిన నీటిని శాంపిల్స్‌గా తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు నీటిని కాచి చల్లార్చిన తరువాత తాగాలని సూచిస్తున్నారు. గుంటూరు ఈస్ట్ ఎంఎల్‌ఎ నసీర్ అహ్మద్ ప్రభుత్వ ఆస్పత్రులో రోగులను పరామర్శిస్తున్నారు. అతిసార బాధితుల సంఖ్య వందల్లో ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించింది. 
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News