Monday, June 30, 2025

ఆరోజు రాత్రంతా నిద్ర పోలేదు: రోహిత్ శర్మ

- Advertisement -
- Advertisement -

2024లో జరిగిన T20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ జట్టు రెండోసారి T20 వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. T20 ప్రపంచ కప్‌ సాధించి నేటితో ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పలు విషయాలను గుర్తు చేసుకున్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన 13 సంవత్సరాల తర్వాత భారత్ సాధించిన తొలి ప్రపంచ కప్‌ ఇదే. ఆదివారం ఈ విషయాన్ని రోహిత్ ప్రస్తావిస్తూ..”13 సంవత్సరాలు చాలా సమయం. ప్లేయర్లకు 13 సంవత్సరాల కెరీర్ ఉండదు. నేను చివరిగా గెలిచిన ప్రపంచ కప్ 2007లో. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. నేను ప్రపంచ కప్ గురించి మాత్రమే ఆలోచించాను. నేను నా భయాన్ని బయటకు చూపించను, కానీ అది నాలో ఉంది. ఫైనల్ మ్యాచ్ రోజు ఉదయం నా గది ముందు నుంచి స్టేడియాన్ని చూస్తూ… మరో రెండు గంటల్లో నేను అక్కడ ఉంటాను. నాలుగు గంటల తర్వాత ఏమి జరుగుతుందో నాకు తెలియదు. నాలుగు గంటల తర్వాత మ్యాచ్ ఫలితం వస్తుంది. కప్పు ఇక్కడ లేదా అక్కడ ఉంటుంది” అని అనుకున్నానని రోహిత్ తెలిపాడు.

కాగా, గత ఏడాది జూన్ 29న బార్బడోస్‌లో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి రోహిత్ సేన T20 ప్రపంచ కప్ 2024ను కైవసం చేసుకుంది. ఫైనల్‌లో 176 పరుగులను డిఫెండ్ చేసిన భారత్ జట్టు, చివరి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో స్టార్ బ్యాట్స్ మెన్లు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ ఉండటంతో ప్రపంచ కప్ దాదాపు భారత్ చేతుల్లో నుండి వెళ్లిపోయిందని అందరూ భావించారు. ఈ క్రమంలో బుమ్రా, హార్దిక్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. 17వ ఓవర్ లో పాండ్యా..క్లాసెన్‌ను ఔట్ చేసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. తర్వాత 18వ ఓవర్లో బుమ్రా కేవలం రెండు పరుగుల మాత్రమే ఇచ్చాడు.దీంతో చివరి 12 బంతుల్లో 20 పరుగులు అవసరం కాగా.. డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉండటంతో సఫారీ జట్టు ఇంకా రేసులోనే ఉంది. అర్ష్‌దీప్ సింగ్ 19వ ఓవర్ లో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్ లో 16 పరుగులు చేయాల్సి ఉండగా.. హార్దిక్ వేసిన లో టాస్ బాల్ ను మిల్లర్ భారీ షాట్ ఆడాడు. అది సిక్స్ వెళ్తుందని అనిపించినా.. బౌండ్రీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీంతో భారత్ రెండోసారి టీ20 ప్రపంచ కప్ కొట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News