మనతెలంగాణ/కాసిపేటః అతి ఆశకు పోవద్దని, సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ అంటే భయపడాల్సిన అవసరం లేదని మందమర్రి ఎస్‌ఐ రాజశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అతి ఆశ, అవగాహాన లేమి కారణాల వల్లనే సైబర్ నేరాలు పెరుగుచున్నాయని ఆయన అన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు, స్వీయ అప్రమత్తత, అవగాహాన కలిగి ఉండడం అత్యంత అవసరం అని ఆయన తెలిపారు. ప్రజలు డిజిటల్ అరెస్టు అనగానే భయపడవద్దని అలాంటి కాల్స్ వస్తే స్థానిక పోలీసులకు సమచారం ఇవ్వాలని ఆయన సూచించారు. యువత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ల జోలికి వెల్లవద్దని ఆయన హెచ్చరించారు. సోషల్ మిడియా ద్వారా వచ్చె అనధికార లింకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాట్సాప్ లో వచ్చె మేసేజ్ లను క్లిక్ చేయవద్దని ఆయన తెలిపారు.
ఇటీవల సైబర్ నేరగాళ్లు నకిలీ పిఎం కిసాన్, ఎస్‌బిఐ రివార్డు వంటి పేర్లతో ఏపికె ఫైల్స్(APK FiLlS) వాట్సాప్, టెలిగ్రామ్, ఇతర సోషల్ మిడియా మాధ్యమాల దారా పంపిస్తున్నారని, పొరపాటున అలాంటి యాప్స్ ను క్లిక్ చేయవద్దని, చేస్తే అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యో ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. దీని ద్వారా OTP లు బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్తాయని, ఆ తరువాత నేరగాళ్లు బాదితుడి వాట్సాప్ ఖాతాను హైజాక్ చేసి కాంటాక్ట్‌లో ఉన్న వారందరికి అటోమెటిక్ గా పంపిస్తారని ఎస్‌ఐ వివరించారు. సైబర్ నేరగాళ్ల మోసాల వల్ల భాదితులు తీవ్రమైన ఆర్థిక నష్టాలకు, వ్యక్తి గత డేటా చోరికి గురవుతాయని ఆయన తెలిపారు. APK లింక్ వస్తే వెంటనే డీలీట్ చేయాలని ఆయన సూచించారు.