Thursday, May 22, 2025

ప్రతిభావంతుల కోసం ‘దిల్ రాజు డ్రీమ్స్’

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతోమంది హీరోలను, నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్లను తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. ఇప్పుడు ఆయన మరో ముందడుగు వేసి, తెలుగు సినీ పరిశ్రమకు మరింత టాలెంట్‌ను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త టాలెంట్‌ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసేందుకు దిల్ రాజు తాజాగా ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేశారు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఫ్రెష్ కంటెంట్‌ను, టాలెంట్ ను ప్రోత్సహించే దిల్ రాజు ఇప్పుడు ‘దిల్ రాజు డ్రీమ్స్’ (Dil Raju Dreams)ప్లాట్‌ఫామ్ ద్వారా యంగ్ టాలెంట్ ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. జూన్ నెల నుంచి ఆయన సిద్ధం చేసిన ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్ యాక్టివ్ కానుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగం కావాలనుకునే వారు https://dilrajudreams.com/ లింక్‌పై క్లిక్ చేసి తమ వివరాలను నమోదు చేస్తే, దిల్ రాజు డ్రీమ్స్ బృందం స్వయంగా వారిని సంప్రదిస్తుంది. జూన్‌లో ఈ పోర్టల్ సిద్ధమైన తర్వాత, ‘దిల్ రాజు డ్రీమ్స్‘ ద్వారా యువ ప్రతిభావంతులు తమ ఆలోచనలను ఈ బృందం దృష్టికి తీసుకెళ్లవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News