Monday, June 30, 2025

చిత్ర పరిశ్రమలోకి రావాలనుకున్న వారి కోసం..

- Advertisement -
- Advertisement -

‘కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కి ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది. వాళ్లకి సరైన గైడెన్స్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఆలోచనే ఈ దిల్ రాజు డ్రీమ్స్. (Dil Raju Dreams) ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్‌ని లాంచ్ చేస్తున్నాం’ అన్నారు నిర్మాత దిల్ రాజు. దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా (Website launch event grand) జరిగింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హాజరై వెబ్ సైట్‌ని లాంచ్ చేశారు. దిల్ రాజు డ్రీమ్స్ లాంచింగ్ ఈవెంట్ లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘దిల్ రాజు డ్రీమ్స్‌ని దిల్ రాజుకి ఎందుకు లాంచ్ చేయాలని అనిపించిందో నాకు తెలియదు కానీ ఇది లక్షలాది మందికి ఒక ఆశని ఇచ్చింది.

అవకాశాల గురించి చూస్తున్న ప్రతి ఒక్కరికి నా బెస్ట్ విషెస్. దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి బెస్ట్ ఆఫ్ లక్. ఇందులో ఒక్కరి కల నెరవేరినా ఈ వెబ్ సైట్ లాంచ్ చేయడానికి న్యాయం జరిగినట్టే‘అని అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద భారీ సినిమాలు తీస్తున్నాం. దిల్ రాజ్ ప్రొడక్షన్‌పై కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. కొత్త టాలెంట్ కోసం ఒక కొత్త టీంని ఏర్పాటు చేసినప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి సరైన వేదిక అవుతుందని ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వరల్డ్ వైడ్‌గా లక్ష నుంచి రెండు లక్షల మంది సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఈ ప్లాట్ ఫామ్‌ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నాకు అర్థం అవుతోంది‘’అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శిరీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News