Friday, May 9, 2025

ఏఐ టెక్నీలజీతో ‘రౌడీ జనార్ధన్’

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్ డమ్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత ఈ హీరో రౌడీ జనార్ధన్ సినిమా చేయబోతున్నాడు. రవికిరణ్ కోలా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. అయితే ఈ సినిమాను ఏఐ టెక్నాలజీని ఉపయోగించి భారీ ప్లానింగ్ తో వస్తున్నారు. రౌడీ జనార్ధన్ సినిమాను 6 నెలల్లో పూర్తి చేసేలా దిల్ రాజు పర్ఫెక్ట్ షెడ్యూల్‌ని సిద్ధం చేశారట. ఈమధ్య పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా ఏడాదిలో పూర్తి చేయాలని మొదలు పెట్టి రెండేళ్ల దాకా పూర్తి కావడం లేదు. కానీ దిల్ రాజు మాత్రం రౌడీ జనార్ధన్ విషయంలో అలా కాకుండా ముందు నుంచి జాగ్రత్త పడేలా చూస్తున్నాడు. ఇక ఈ సినిమా కథ కూడా అద్భుతంగా వచ్చిందట. విజయ్ దేవరకొండ ఈ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో కూడా సినిమాను లైన్‌లో పెట్టాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ కథతో రాబోతుందని తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News