ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగి మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13 పరుగులు చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో టీం ఇండియా మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్.. జైస్వాల్‌కి ఓ సలహా ఇచ్చారు. జైస్వాల్ తన దూకుడును తగ్గించుకోవాలని ఆయన అన్నారు.
రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (Yashasvi Jaiswal) జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అసవసర షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. కాబట్టి అలాంటి దూకుడైన షాట్‌లు ఆడే సమయంలో నియంత్రణ పాటించాలని వెంగ్‌సర్కార్ సూచించారు. ‘‘జైస్వాల్ మంచి ఆటగాడు. కానీ, బ్యాటింగ్‌లో అతడు అనవసరమైన దూకుడు స్వభావాన్ని తగ్గించుకోవాలి. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో ప్రతి బంతిని ఎంతో ఓపికగా ఆడాలి. ఏ చిన్న తప్పు చేసినా ఔట్ కాక తప్పదు. టెస్ట్ క్రికెట్‌లో నిలకడ ఎంతో ముఖ్యం. సుదీర్ఘ ఫార్మాట్‌లో నేను అతడి నుంచి మరిన్ని మంచి ఇన్నింగ్స్ రావాలని ఆశిస్తున్నా’’ అని అన్నారు.