సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ’పరదా’ అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పరదా’ ఆగస్ట్టు 22న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “అనుపమ ఈ కథ వినగానే చాలా ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి సినిమా నేను చేయాలని అనుకుంటున్నానని చెప్పారు.
ఈ సినిమా చేయడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. మనాలి, ధర్మశాల… ఇలా ఎన్నో అద్భుతమైన లొకేషన్ లో వందమంది సిబ్బందితో కలిసి ఈ సినిమాని షూట్ చేశాము. -ఎక్కడ గ్రీన్ మ్యాట్ వాడకుండా రియల్ లొకేషన్‌లోకి వెళ్లి షూట్ చేసిన సినిమా ఇది. ప్రేక్షకులకి గొప్ప థియేటర్ అనుభవాన్ని ఇవ్వాలన్న ప్యాషన్‌తో ఈ సినిమా చేశాము. ట్రైలర్‌కి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరూ కూడా చాలా పాజిటివ్‌గా స్పందించారు. ఇందులో అనుపమని గొప్ప నటిగా చూస్తారు. ఇప్పటివరకు చూసిన అనుపమ వేరు ఈ సినిమాలో చూసే అనుపమ వేరు. తెలుగులో ఈ సినిమా చాలా స్పెషల్ ఫిల్మ్ అవుతుందని నమ్మకం ఉంది. ఇది ఫిక్షనల్ స్టొరీ. కానీ రియల్ లైఫ్ సంఘటనలు ఉన్నాయి. గోపీసుందర్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ”అని అన్నారు.