తేజా సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్’. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ గ్రాండ్ సక్సెస్‌ను సాధించింది. భారీ రాకలెక్షన్లు రాబడుతూ.. బాక్పాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు సినీ విశ్లేషకులు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు.
‘‘విఎఫ్ఎక్స్ ఇంత గ్రాండ్ చివరిసారి ఎప్పుడు చూశానో గుర్తులేదు. 400 కోట్లకు పైగా చిత్రాల్లో కూడా చూడలేదు. విలన్‌గా మనోజ్ సెట్ కాడని అనుకున్నాను. కానీ, అతని నటన చూసి నన్ను నేను కొట్టుకున్నాను. ఇంత పెద్ద చిత్రంలో తేజా సజ్జా చిన్నపిల్లాడిలా కనిపిస్తాడని అనుకున్నాను. కానీ నా అంచనా తప్పయింది. విజువల్స్ బిజిఎం, స్క్రీన్‌ప్లే అన్ని అదిరిపోయాయి. ఇంటర్వెల్ సహా మరికొన్ని చోట్ల సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంది. అతీంద్రియ శక్తుల బెదిరింపుల మధ్యలో ప్రేమ, మోసం వంటి అంశాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించారు’’ అని వర్మ (Ram Gopal Varma) పోస్ట్ చేశారు.
ఆ తర్వాత చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనిపై వర్మ ప్రశంసలు కురిపించారు. ‘‘కార్తీక్.. మిరామ్ మీకు కన్న కల. పురాణాలను, హీరోయిజాన్ని కలగలిపి చూపించారు. అన్ని విభాగాలపై మీకున్న పట్టు వల్లే ఇది సాధ్యమైంది. విశ్వప్రసాద్.. మీరు సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుంచి రాకపోయినా మీకున్న ప్యాషన్ వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. ఇండస్ట్రీ పెద్దలు హెచ్చరించినా లెక్క చేయకుండా మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు. దాంతో విజయం సాధించారు. లాభాలు సంపాదించడమే కాకుండా.. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించమం కూడా చిత్ర యూనిట్ బాధ్యత అని నిరూపించారు’’ అని వర్మ పోస్ట్‌లో పేర్కొన్నారు.
Also Read : ఈ నెల చివరలో క్లైమాక్స్ షూటింగ్