Friday, August 29, 2025

సిఎం సహాయనిధికి రూ.10 లక్షలు విరాళం ఇచ్చిన టాలీవుడ్ డైరెక్టర్

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూ.10 లక్షల విరాళాన్ని సిఎం సహాయనిధికి అందించారు. ఈ సందర్భంగా తన సొంత బ్యానర్ భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా, సందీప్ రెడ్డి వంగా పదిలక్షల చెక్కును సిఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. శుక్రవారం జూబ్లీహిల్స్ నివాసంలో సిఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ చెక్కుని సందీప్ రెడ్డి వంగా అందించడం విశేషం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా ఎంతోమంది నిరాశ్రులయ్యారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు సందీప్ రెడ్డి ఈ సహాయం అందించారు. తెలుగులో అర్జున్ రెడ్డి, బాలీవుడ్‌లో కబీర్‌సింగ్, యానిమాల్ సినిమాలతో తెలుగు, హిందీ ప్రేక్షకుల దృష్టిలో హిట్ డైరెక్టర్‌గా ఆయన నిలిచారు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ అనౌన్స్ చేసి టాక్ అఫ్ ది ఇంటర్నేషనల్‌గా మారారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News