Friday, May 23, 2025

మెగా అభిమానులకు సారీ… నేను ఆ తప్పు చేయలేదు: డైరెక్టర్ విజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులందరికీ డైరెక్టర్ విజయ్ కనకమేడల క్షమాపణలు తెలిపారు. తాము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసామని, అప్పటి నుంచి తన మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్ జరుగుతుందని,.దానికి ముందు నుంచి కూడా మెగా అభిమానుల నుంచి తన మద్దతుగా ఉన్నారని కొనాయడారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎత్తుకున్న ఫొటో నో విజయ కనకమేడాల ట్విట్టర్ ఖాతా నుంచి పోస్టు చేశారు. ఈ పోస్టుకు సామాజిక న్యాయం  అనే క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో మెగా అభిమానులు డైరెక్టర్ విజయ్ ను ట్రోల్ చేస్తున్నారు. దీంతో విజయ్ వివరణ ఇచ్చుకున్నారు. కానీ ఈ రోజు తనకు తెలియకుండా 30 మినిట్స్ నుంచి మెగా అభిమానుల వైపు నుంచి కూడా ట్రోల్ జరుగుతున్నట్టు తెలిసిందని, ఎప్పుడో 2011లో ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టానని ట్రోల్ చేస్తున్నారని, అది తాను పెట్టిన పోస్ట్ కాదని, హ్యాక్ అయి ఉంటుందని విజయ వివరణ ఇచ్చారు. తాను అందరు హీరోలతో పని చేశానని, ఎక్కువ పని చేసింది మెగా హీరోలతోనేనని, వారితో మంచి సానిహిత్యం తనకు ఉందన్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకు తాను పని చేశానని, అప్పుడు తనని కళ్యాణ్ బాగా సపోర్ట్ చేశారని, అదే సమయంలో సాయి ధరమ్ తేజ్ కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకోమని చెప్పారని గుర్తు చేశారు. తేజ్ తో తనకు మంచి అనుబంధం ఉందని, ఆయన తనని అన్నా అన్నా అని సంబోధిస్తారని, అలాంటిది తాను మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటానని ప్రశ్నించారు. అందరిలాగే తాను కూడా చిరంజీవి, పవర్ స్టార్ సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ అవుదామనుకున్నానని, అటువంటిది తానెందుకు వాళ్లను దూరం చేసుకుంటానని, అలాంటి తప్పు ఎందుకు చేస్తానని వాపోయారు.

‘నా సోషల్ మీడియా పేజీలో అది పోస్ట్ అయిందని, అది తెలిసో తెలియకో జరిగింది, హ్యాక్ అయింది. అయినా కూడా నా సోషల్ మీడియా పేజీ కాబట్టి బాధ్యత తీసుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ఇంకొకసారి ఇలాంటివి రాకుండా చూసుకుంటానని, ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటానని, ఎందుకంటే ఒక పక్కన తన సినిమాపై ట్రోలింగ్ జరుగుతుందన్నారు. ఈ క్రమంలో ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చని, ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదన్నారు. ‘దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నా, ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవు మెగా అభిమానులు అందరికీ మీలో ఒకడిగా నేను హామీ ఇవ్వడంతో పాటు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నా’ అని విజయ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News