- Advertisement -
హైదరాబాద్: రేట్ రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రాలకు రెవెన్యూ తగ్గే ప్రమాదం ఉందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఫెడరల్ స్ఫూర్తితో కేంద్రం వ్యవహరించాలని అన్నారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో జిఎస్టి రేషనలైజేషన్ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు బాగేంటేనే.. దేశం బాగుంటుందని తెలియజేశారు. రేషనలైజేషన్ ను ఆహ్వానిస్తూనే రాష్ట్రాలకు జరిగే నష్టానికి..పరిహారం చెల్లించే మార్గాలను కేంద్రం ఆలోచించాలని కోరారు. సెప్టెంబర్ 3న మరోసారి ఢిల్లీలో 8 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో తమ డిమాండ్లు లేవనెత్తాలని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు.
Read Also : కెసిఆర్ సభలో మాట్లాడతానంటే మా సమయం ఇస్తాం: ఐలయ్య
- Advertisement -