ప్రస్తుతం టాలీవుడ్లో కార్మికుల వేతనాల పెంపు విషయమై నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సినిమా నిర్మాణంలో బడ్జెట్ పెరుగుతుండడంపై మాట్లాడుతూ “నిర్మాతలు తాము తీసే సినిమాను ఇంకో చిత్రంతో పోల్చుకు ని కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు. అలాంటి వాళ్ల పేర్లను చెప్పడం నాకు ఇష్టం లేదు. అలాగే ప్రొడక్షన్ వ్యాల్యూ అనే పదం.. టాలీవుడ్లో తప్పా ఇండియాలో మరే ఇండస్ట్రీలో వినిపించదు. ఒక సినిమాతో పోల్చుకొని దానికంటే భారీగా తీయాలనే ఉద్దేశంతో ఖర్చు పెడుతున్నారు. ఓ సినిమాలో ఓ సెట్ ఉంది అంటే..
మనం తీసే దాంట్లో దాని కంటే కనీసం ఓ 20 ఫీట్లు సెట్ ఎక్కువగా వేయాలి, అక్కడ 10 గుర్రాలు వాడితే, మన దాంట్లో 40 గుర్రాలు ఉండాలని అనుకుంటున్నారు. దీన్నే పెద్ద విషయంగా నిర్మాతలు భావిస్తున్నారు. ప్రొడక్షన్ వ్యాల్యూ అనే పదం తెలుగు ఇండస్ట్రీలో (Telugu industry) తప్పితే ఇంకెక్కడా వాడరు. మలయాళంలో అస్సలు ఆ పదం లేదు. బాలీవుడ్ లో ఆ సమస్యే లేదు. కానీ ఈ పదం ఇక్కడే ఉంది. క్రిటిక్స్ కూడా ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి, బాగా తీశారని అంటున్నారు”అని తెలిపారు.