- Advertisement -
టాలీవుడ్ లో థియేటర్ల బంద్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. బంద్ ప్రకటనకు నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డే అని జనసేన నేత, డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ సత్యనారాయణ ఆరోపించారు. థియేటర్ల బంద్ వెనుక సత్యనారాయన ఉన్నట్లు ఆరోపణలు రావడంతో జనసేన ఆయనను సస్పెండ్ చేసింది.దీంతో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “జూన్ 1న థియేటర్ల బంద్ అని ప్రకటించింది దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి. తమ్ముడుని కాపాడుకోవడానికి దిల్ రాజు నాపై అభాండం వేశారు. కమల్ హాసన్‌ను మించి ఆస్కార్ రేంజ్‌లో దిల్ రాజు నటించాడు. దురుద్దేశంతోనే నా పేరు చెప్పారు. పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో దిల్ రాజు జనసేన పేరు ఎత్తారు. నేను థియేటర్ల బంద్ అని ఎక్కడా అనలేదు” అని తెలిపారు.
- Advertisement -