Friday, June 13, 2025

పార్టీకి పిలిస్తే వెళ్లాను.. అంతేకానీ నాకేం సంబంధం లేదు: దివి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చేవెళ్లలోని ఓ రిసార్ట్‌లో సింగర్ మంగ్లీ (Mangli) ఇచ్చిన బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి లభించిన విషయం తెలిసిందే. పక్క సమాచారంతో పార్టీపై దాడి చేసిన పోలీసులు పార్టీకి హాజరైన వారిలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ పార్టీకి బిగ్‌బాస్ ఫేమ్, నటి దివి వైద్య (Divi Vadthya) కూడా హాజరయ్యారు. దీంతో ఆమె పేరు కూడా ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఈ విషయంపై దివి స్పందించారు. ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి పిలిస్తే వెళ్లాను కానీ, ఆక్కడ జరిగిన దానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె పేర్కొంది. తాను నిజంగా తప్పు చేసుంటే ఆ మేరకు సాక్ష్యాలు ఉంటే.. తన ఫోటో వేయండని స్పష్టం చేసింది. కానీ, ఎలాంటి సాక్ష్యం లేకుండా తన ఫోటో వాడి నెగెటివ్ ప్రచారం చేస్తుంటే.. తన కెరీర్‌కు ఇబ్బంది కలుగుతుందని అంది.

‘‘ఎంతో కష్టపడి ఇంతదూరం వచ్చాను. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ బర్త్‌డే కాబట్టి వెళ్లాను. అక్కడ జరిగిన పరిస్థితులకు నేను కారణం అన్నట్లుగా నా ఫోటో వేస్తున్నారు. మీ ఫ్రెండ్ పుట్టినరోజులో ఏదైనా పొరపాటు జరిగితే మీరు బాధ్యత తీసుకుంటారా? కాదు కదా.. దయచేసి నా ఫోటోలు వాడకండి. నాకు ఇబ్బంది అవుతుంది’’ అంటూ దివి ఆడియో విడుదల చేసింది. మంగ్లీ బర్త్‌డే పార్టీకి వెళ్లానే తప్ప అక్కడ జరిగిన పరిణామాలకు, తనకు ఎటువంటి సంబంధం లేదని దివి  స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News