- Advertisement -
ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. తొలిసారి ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌ను భారత్ దక్కించుకుంది. మహారాష్ట్రకు చెందిన దివ్య దేశ్‌ముఖ్ (Divya Deshmukh) ఫైనల్లో కోనేరు హంపిపై విజయం సాధించింది. ఫైనల్లో తొలి రెండు గేమ్స్ డ్రాగా ముగిశాయి. దీంతో సోమవారం నిర్వహించి టై బ్రేకర్ నిర్వహించారు. ఈ టై బ్రేకర్‌లో హంపిపై గెలుపును సొంతం చేసుకుంది. ఈ విజయంతో 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ గ్రాండ్ మాస్టర్ హోదాను పొందింది.
ఈ సందర్భంగా దివ్య (Divya Deshmukh) మాట్లాడుతూ.. ‘‘ఈ ఆనందాన్ని నమ్మడానికి నాకు కొంత సమయం పడుతుంది. గ్రాండ్ మాస్టర్ టైటిల్‌ని ఈ విధంగా నేను పొందడం పూర్తిగా విధి అని భావిస్తున్నాను. ఈ టోర్నమెంట్‌కి ముందు నాకు ఎలాంటి ప్రమాణాలు లేవు. ఈ విజయం నాకు ఎంతో ముఖ్యమైనది. ఇంకా చాలా సాధించాలి. ఇది కేవలం ఆరంభం మాత్రమే’’ అని అన్నారు.
- Advertisement -