Thursday, September 4, 2025

వినాయక నిమజ్జనంలో విషాదం… యువకుడి ప్రాణం తీసిన డిజె

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా బొబ్బాదిపేటలో వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. బొబ్బాదిపేటలో వినాయక నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర చేపట్టారు. హరీశ్(22) అనే యువకుడు డిజె ముందు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. డిజె శబ్దానికి తట్టుకోలేక అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపాడు. భారీ శబ్దం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు డ్యాన్స్‌లు చేస్తే శరీరం అలసటకు గురై గుండెపోటు పోటు వచ్చే అవకాశం కూడా ఉంది. గ్రామ ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీంటిపర్యంతమయ్యారు.

Also Read: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్టెతస్కోప్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News