Monday, May 26, 2025

వివాదాలకు తావు ఇవ్వొద్దు…. ప్రకటనల్లో సంయమనం పాటించండి

- Advertisement -
- Advertisement -

ఎన్డీఏ నాయకులకు ప్రధాని మోదీ హితవు
పాకిస్తాన్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ, మోదీ పునరుద్ఘాటన
లూజ్ టాక్ వద్దు – మోదీ హెచ్చరిక

న్యూఢిల్లీ: నాయకులు బహిరంగ ప్రకటనల విషయంలో సంయమనం పాటించాలని, లూజ్ టాక్ వద్దని, ప్రధాని మోదీ హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ నాయకుల సమావేశంలో ప్రధాని ఇటీవల తలెత్తిన వివాదాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఈ హితవు చెప్పారు. ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుపరిపాలనపై ప్తత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సిందూర్ తర్వాత కాల్పుల విరమణ ప్రారంభమైందని, దీనిలో మూడో దేశం ప్రమేయమే లేదని ప్రధాని పునరుద్ఘాటించారు.

కొందరు పార్టీ నాయకులు విచక్షణారహితంగా చేస్తున్న ప్రకటనల పై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. అనవసరమైన ప్రకటనలు, వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, క్రమశిక్షణతో కూడిన కమ్యునికేషన్ అవసరమని మోదీ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్, హర్యానాకు చెందిన బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల పార్టీ ఇబ్బంది కరమైన పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చిందన్నారు మోదీ. ఆపరేషన్ సిందూర్ పై బ్రీఫింగ్ సందర్భంగా సాయుధదళాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విజయ్ షా అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది
. అలాగే హర్యానా ఉప ముఖ్యమంత్రి జగదేష్ దేవ్డా సాయుధదళాలు ప్రదాని మోదీకి తలవంచాలని సూచించడం రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్డీఏ ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆపరేషన్ సిందూర్, కుల ప్రాతిపదికన జనగణన, సుపరిపాలన అందించాల్సిన అవసరం వంటి పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News