Tuesday, May 13, 2025

ఇల్లు విక్రయించి డ్రగ్స్ కొన్న వైద్యురాలు

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పట్టుబడ్డ వైద్యురాలి కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఓ కార్పొరేట్ ఆస్పత్రి సిఈఓగా గతంలో పనిచేసిన వైద్యురాలు(34) డ్రగ్స్‌కు బానిసగామారింది. దర్గాలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఇద్దరు పిల్లలతో ఉంటోంది. ముంబాయికి చెందిన డ్రగ్స్ డీలర్ టక్కర్ వద్ద రెగ్యులర్‌గా డ్రగ్స్ కొనుగోలు చేస్తోంది. వాట్సాప్‌లో ఆర్డర్ ఇవ్వడంతో టక్కర్ తన అనుచరుడితో వైద్యురాలికి తరచూ కొకైన్ పంపిస్తున్నాడు. వైద్యురాలు ఏడాదికి డ్రగ్స్ కోసం కోటి రూపాయలకుపైగా ఖర్చు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. వైద్యురాలు డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో ఇంటిని కోటి రూపాయలకు విక్రయించి డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. వైద్యురాలికి ముంబాయి నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న టక్కర్‌కు నగరంలో చాలామంది కస్టమర్లు ఉన్నట్లు పోలీసులకు తెలియడంతో అతడిని పట్టుకునేందుకు టీంలను ముంబాయికి పంపించినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News