- Advertisement -
శ్రీనగర్: భారత్ లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అతివేగంతో పాటు కొండ ప్రాంతాలలో ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాహనాలు లోయలో పడిపోవడం అనేది రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఉత్తర భారతంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాలలో వాహనాలు లోయల్లో పడిపోతున్నాయి. తాజాగా జమ్ము కశ్మీర్ రాష్ట్రం దోడలో మినీ బస్సులో లోయలో పడిపోవడంతో ఐదుగురు మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
- Advertisement -