దానిని మరింత పతనానికి తీసుకెళ్తున్నారు
రష్యా ఆర్థిక పరిస్థితి ఇందుకు భిన్నం కాదు
భవిష్యత్‌లో భారత్‌కు పాకిస్తాన్ చమురు
విక్రయాలు చేయవచ్చు చమురు నిల్వలు
పెంచుకోవడానికి పాక్‌తో ఒప్పందం : ట్రంప్
అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై తీవ్రంగా
స్పందించిన విపక్షాలు భారత ఆర్థిక
వ్యవస్థ క్షీణించిందని మోడీకి తప్ప అందరికీ
తెలుసు : రాహుల్ గాంధీ ఇప్పటికీ
ట్రంప్‌పై మౌనమేనా? నిలదీసిన
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
11 ఏళ్ల బంధం తెగిపోయిందా? : అఖిలేశ్
బిజినెస్ మ్యాన్ ట్రంప్ బేరాల తంతు ఇది :
శశిథరూర్
వాషింగ్టన్: భారత్, రష్యాలవి డెడ్ ఎకానమీల ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యనించారు. ఇప్పటికే క్షీణించిన ఈ ఆర్థిక వ్యవస్థలను మరింత పతనానికి దిగజార్చుతున్నారని ఆరోపించారు. భారత దిగుమతులపై 25 సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన వి షయం తెలిసిందే. రష్యానుంచి భారీగా చమురును దిగుమతి చేసుకొంటూ ఉండడమే దీనికి కారణము కూడా ట్రంప్ ప్రకటించారు. తాజా గా ఆయన భారత్, రష్యాలనుద్దేశిస్తూ మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఒక పోస్టు పెట్టారు. రష్యాతో భారత్ ఎ లాంటి వాణిజ్య సంబంధాలు పెట్టుకున్నా తనకు సంబంధం లేదన్నారు. అయితే ఆ దేశా లు వారి మృత ఆర్థిక వ్యవస్థలను మరింత పతనానికి తీసుకు వెళ్తున్నాయని వ్యాఖ్యానించా రు. అంతేకాదు తాము భారత్‌తో చాలా తక్కు వ వ్యాపారం చేస్తున్నామన్నారు. ఎందుకంటే భారత్ అత్యధికంగా సుంకాలు విధిస్తోందని ఆరోపించారు.
అమెరికా, రష్యాలు ఎలాంటి వ్యాపారం చేయడం లేదని కూడా ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్‌పై కూడా ట్రంప్ మండిపడ్డారు. తమతో అమెరికా గేమ్ ఆడుతోందని, అది యుద్ధానికి దారి తీయవచ్చని మెద్వెదేవ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన ఇప్పటికీ అధ్యక్షుడినేనని అనుకొంటున్నారని మండిపడ్డారు.కాగాపాకిస్థాన్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్‌లో భారీ ఎత్తున చమురు నిక్షేపాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయడానికి రెండుదేశాలు కలిసి పని చేస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ భారత్‌కు పాకిస్థాన్ చమురును విక్రయించవచ్చని వ్యాఖ్యానించవచ్చంటూ ఆసకితకరమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే పాకిస్థాన్‌లో ఉన్న భారీ చమురు నిక్షేపాలు ఏమిటో మాత్రం ట్రంప్ చెప్పకపోవడం గమనార్హం. ట్రేడ్‌డీల్ గురించి ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అమెరికా, పాకిస్థాన్‌ల మధ్య ఒక వాణిజ్య ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. ‘ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు చమురు నిల్వలను పెంచుకోవడంలో కలిసి పనిచేస్తాయి.అందుకోసం ఓ మంచి చమురు కంపెనీని ఎంచుకునే ప్రక్రియలో ఉన్నాం.
ఈ కారణంగా భవిష్యత్తులో పాక్ భారత్‌కు చమురును ఎగుమతి చేయవచ్చు’ అని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ సముద్ర తీర ప్రాంతాల వెంబడి భారీ చమురు నిక్షేనాలున్నాయని పాక్ చాలా కాలంగా చెప్తూ వస్తోంది కానీ వాటిని వెలికి తీసే విషయంలో ఎలాంటి పురోగతి లేదు. కాగా ఇప్పుడు ఈ నిల్వలను సద్వినియోగం చేసుకోవడానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అది ప్రయత్నిస్తోంది. తమ దేశంతో చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒక ట్వీట్‌లో కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇరు దేశాల మధ్య సహకారాన్ని ఇది మరింత విస్తృతం చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వాషింగ్టన్‌లో పాక్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్, అమెరికా వాణిజ్యమంత్రి హోవర్డ్ లుట్నిక్, అమెరికా వాణిజ్య ప్రతినిధి రాయబారి జేమీసన్ గ్రీర్ మధ్య చర్చల్లో ఈ ఒప్పందం కుదిరినట్లు రేడియో పాకిస్థాన్ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింతగా పెంచుకోవడంతో పాటుగా పాక్‌లో అమెరికా పెట్టుడులను ఆకర్షించడం, ఇరు దేశాలకు ఆసక్తి ఉన్న రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంఈ ఒప్పందం లక్షం. దీనివల్ల ముఖ్యంగా అమెరికాకు పాక్ ఎగుమతులపై విధించే సుంకాలు తగ్గడానికి కూడా వీలవుతుంది.