Thursday, July 24, 2025

ట్రంప్ 25 సార్లు అన్నారు : రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

భారత్‌ -పాక్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 25 సార్లు చెప్పారని, దీనిపై కేంద్రం వివరణ ఇవ్వాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. “ కేంద్రం ఏమని చెబుతుంది. ట్రంప్ కాల్పుల విరమణ చేయించారనా ? కానీ అలా చెప్పలేరు. అయినా అదే నిజం. ఇది కేవలం కాల్పుల విరమణ వరకే కాదు. మనం చర్చించాల్సిన చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. కాల్పుల విరమణ చేయించినట్టు 25 సార్లు ట్రంప్ చెప్పారు. అసలు ట్రంప్ ఎవరు ? అది ఆయన పనికాదు. ప్రధాని సమాధానం ఇవ్వడం లేదు. అది వాస్తవం. ” అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

మరోసారి ట్రంప్ నోట అదే మాట ..
భారత్‌పాక్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పించామని మంగళవారం కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. ఈ ఘర్షణలో ఐదు విమానాలు కూలిపోయినట్టు చెప్పారు. కాకపోతే.. ఏ దేశానివో మాత్రం వెల్లడించలేదు. ఈ ఘర్షణ అణుయుద్ధం వరకు వెళ్లేదన్నారు. రెండు వైపులా యుద్ధ విమానాలు కూలిపోయినట్టు పేర్కొన్నారు. మరోవైపు ఇటీవల జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌డోభాల్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత్ వైపు నష్టం జరిగినట్టు కనీసం ఓ గాజు పెంకునైనా చూపించాలని సవాల్ చేయడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News